6 ఏళ్ల వయసులోనే తండ్రిని నడిపిన తనయుడు హరికృష్ణ !

6 ఏళ్ల వయసులోనే తండ్రిని నడిపిన తనయుడు హరికృష్ణ !

ఒకప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్య రథయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం పర్యటించి ఘన విజయాన్ని  అందుకున్న సంగతి తెలిసిందే.  వేల కిలోమీటర్లు తిరిగిన అన్నగారి ఆ చైతన్య రథాన్ని నడిపింది ఎవరో కాదు ఆయన తనయుడు హరికృష్ణే.  యాత్రకు రథసారథిగా, అనుక్షణం  తండ్రికి అంగరక్షకుడిగా పనిచేసిన హరికృష్ణ చిన్ననాటి నుండే ప్రజా కార్యక్రమాల్లో తండ్రి కంటే ఒకడుగు ముందే ఉండేవారు. 

హరికృష్ణ మరణవార్త తెలియగానే ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్న దర్శకుడు క్రిష్ సినిమా కోసం తాను సేకరించిన ఇన్ఫర్మేషన్ నుండి హరికృష్ణగారి చిన్ననాటి ఫోటో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఆ ఫోటో 1962లో దేశ రక్షణ విరాళాలు సేకరించడం కోసం ఎన్టీఆర్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలోనిది.  అందులో కేవలం 6 ఏళ్ల వయసున్న హరికృష్ణ తండ్రిని నడుపుతున్న తనయుడు అనేలా వడివడిగా ఎన్టీఆర్ కంటే ముందే నడుస్తున్న అపురూప దృశ్యం కనిపిస్తోంది.  హరికృష్ణ తండ్రిని ఏ స్థాయిలో అనుసరించేవారో చెప్పడానికి ఈ ఫోటోనే నిదర్శనం.