క్రిష్ దర్శకత్వంలో మహేష్ బాబు..!!?

క్రిష్ దర్శకత్వంలో మహేష్ బాబు..!!?

మహేష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వం మహర్షి సినిమా చేస్తున్నాడు.  ఇది మహేష్ కు 25 వ సినిమా.  ఇది పూర్తవ్వగానే సుకుమార్ తో సినిమాకు రెడీ అవుతారు.  అది 2020 వ సంవత్సరంలో పూర్తవుతుంది.  ఈ సినిమా తరువాత మహేష్ బాబు గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేయబోతున్నాడు.  ఇది మహేష్ కు 27 వ సినిమా అవుతుంది.  మొదట ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకుడు అని అనుకున్నారు.  

సందీప్ కు అనుభవం లేని కారణంగా ఓ అనుభవజ్ఞుడైన దర్శకుడిని తీసుకోవాలని అనుకున్నాడట అల్లు అరవింద్.  మహేష్ బాబు కోసం క్రిష్ ను ఎంపిక చేసినట్టుగా ఫిల్మ్ నగర్ టాక్.  గతంలో క్రిష్.. మహేష్ తో సినిమా చేయాలని చాలా ప్రయత్నించాడు. శివం అనే పేరుతో ప్రాజెక్ట్ కూడా రెడీ చేసుకున్నాడో.  ఎందుకో అది వర్కౌట్ కాలేదు.  

క్రిష్ టాలెంటెడ్ డైరెక్టర్.  అందులో ఎలాంటి సందేహం లేదు.  సాఫ్ట్ కార్నర్ కథలతో సినిమాలు తీయడంలో క్రిష్ సమర్ధుడు.  మరోవైపు హిస్టారికల్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించగలడు.  మరి మహేష్ బాబు లాంటి కమర్షియల్ హీరోలకు క్రిష్ సెట్ అవుతాడా..? లేదా? చూడాలి.