ఖిలాడీతో క్రిష్ మరోసారి

ఖిలాడీతో క్రిష్ మరోసారి

బాలీవుడ్ లో ప్రయోగాలు చేసే వ్యక్తుల్లో ఖిలాడీ అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో ఉంటాడు అనడంలో సందేహం లేదు.  అక్షయ్ కుమార్ తో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ఇప్పటికే గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమా చేశాడు.  రీమేక్ అయినప్పటికి బాలీవుడ్ లో సూపర్ హిట్టైంది.  ఇదిలా ఉంటె, గత కొంతకాలంగా క్రిష్ చేస్తున్న సినిమాలు వరసగా పరాజయం పాలవుతున్నాయి.  బాలకృష్ణతో చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సీరీస్ పరాజయం పాలైంది.  అటు బాలీవుడ్ లో మాణికర్ణక సినిమా నుంచి బయటకు వచ్చి వివాదంలో చిక్కుకున్నాడు.  

ఎన్టీఆర్ బయోపిక్, మణికర్ణిక సినిమాల ద్వారా ఇబ్బందులు పడ్డ క్రిష్, బాలీవుడ్ లోనే అక్షయ్ కుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.  అక్షయ్ కు ఇప్పటికే కథ చెప్పారట.  క్రిష్ స్క్రిప్ట్ వర్క్స్ లో ఉన్నారని తెలుస్తుంది.