ఏపీ తెలంగాణా బస్సుల గురించి ఏపీ అధికారి కీలక వ్యాఖ్యలు !

ఏపీ తెలంగాణా బస్సుల గురించి ఏపీ అధికారి కీలక వ్యాఖ్యలు !

ఏపీ తెలంగాణా బస్సుల గురించి ఏపీ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం బస్ సర్వీసులను పెంచడానికి ఇష్టపడడం లేదని ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. తెలంగాణా ఏపీని బస్సులు తగ్గించుకోమని సూచిస్తోందని, తెలంగాణ సూచనల మేరకు సర్వీసులను తగ్గించుకోవవడానికి సిద్దంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఏపీ తగ్గించుకునే 1.10 లక్షల కిలోమీటర్ల మేర రవాణను ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. ఏపీ తిప్పే సర్వీసుల కంటే డబుల్ సర్వీసులు తిప్పుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని ఆయన పేర్కొన్నారు.

అయితే బెజవాడ-హైదరాబాద్ రూట్లో మాత్రమే డబుల్ సర్వీసులు తిప్పుతాంటనంటోన్న తెలంగాణ.. మిగిలిన రూట్ల గురించి ప్రస్తావించడం లేదని ఆయన అన్నారు. ఏపీ 72 రూట్లల్లో బస్సులు తిప్పుతుంటే.. తెలంగాణ 27 రూట్లల్లో మాత్రమే బస్సులు నడుపుతోందని ఆయన అన్నారు. అంటే ఇప్పట్లో ఏపీ - తెలంగాణా మధ్య బస్సులు మొదలయ్యే సూచనలు అయితే కనిపించడం లేదు. అయితే ప్రైవేటు బస్ ఆపరేటర్ లు బస్సులు నడుపుతుండడం కొంత మేర ఇబ్బంది లేకుండా చేస్తుందని చెప్పచ్చు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రుల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని క్లియర్ చేస్తాయని భావించినా ఎందుకో ఈ విషయం వెనక్కు వెనక్కు వెళ్తూనే ఉంది.