శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిని నిలిపివేయాలంటూ కేంద్రానికి కృష్ణా బోర్డు లేఖ...

శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిని నిలిపివేయాలంటూ కేంద్రానికి కృష్ణా బోర్డు లేఖ...

శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న జల విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం బోర్డు సభ్యుడు ఎల్‌.బి ముంతాంగ్‌ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం  తీరు కారణంగా రాయలసీమ, చెన్నై వంటి ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నామని ఏపీ ప్రభుత్వం.. బోర్డుకు ఫిర్యాదు చేసింది. విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కృష్ణా బోర్డు చెప్పిన తెలంగాణ పట్టించుకోలేదు. దీంతో కేంద్రానికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. ప్రస్తుతం  శ్రీశైలం జలాశయంలోకి 28 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, జలవిద్యుత్తు కేంద్రం ద్వారా 38 వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.