చంద్రబాబు నివాసానికి వరదముప్పు..!

చంద్రబాబు నివాసానికి వరదముప్పు..!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసముంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కు వరదముప్పు పొంచిఉంది అంటున్నారు అధికారులు.. కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర కూడా వరద పెరుగుతోంది. అయితే, వరద నీరు చంద్రబాబు నివాసంలోకి రాకుండా రక్షణ చర్యలు చేపట్టారు. టీడీపీ స్థానిక నేత నేతృత్వంలో చంద్రబాబు నివాసం దగ్గర ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. వందలాది స్టోన్ క్రష్ ఇసుక బస్తాలతో వరద రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వరద మరింత పెరిగితే మాత్రం ఇంట్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు చంద్రబాబు నివాస పరిసర ప్రాంతాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కుల వరకు ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో వస్తుంది. దీంతో, కృష్ణా కరకట్ట ఉన్న ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. ఇక, వరద పెరిగిన దృష్ట్యా చంద్రబాబు నివాసం నుంచి ఆయన కాన్వాయ్‌ని తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు, చంద్రబాబు ప్రస్తుతం ఆ నివాసంలో లేరు.. ఆయన బుధవారం సాయంత్రమే హైదరాబాద్‌ చేరుకున్న సంగతి తెలిసిందే.