అయోధ్య తరహాలోనే మథుర కోసం పెరుగుతున్న డిమాండ్...!!

అయోధ్య తరహాలోనే మథుర కోసం పెరుగుతున్న డిమాండ్...!!

అయోధ్య రామ్ జన్మభూమి కేసు ఎన్నో మలుపులు తిరిగి చివరకు 2019లో పరిష్కారం జరిగింది.  అయోధ్యలోని వివాదాస్పదంగా ఉన్న భూమిని అయోధ్య ట్రస్ట్ కు అప్పగించింది.  ఈ ఏడాది ఆగష్టు 5 వ తేదీన అయోధ్యలో మందిరం నిర్మాణం కోసం భూమి పూజను నిర్వహించారు.  అయోధ్య రామ్ జన్మభూమి వివాదం తరువాత ఇప్పుడు శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించిన వ్యవహారం తెరమీదకు వచ్చింది.  శ్రీకృష్ణుడు జన్మించిన మథురలో శ్రీకృష్ణ దేవాలయం నిర్మించిన సంగతి తెలిసిందే.  ఈ దేవాలయానికి పక్కనే షాహి ఈద్గా ఉన్నది.  ఈ ఈద్గా ను అక్కడి నుంచి తొలగించాలని చెప్పి చాలా ఏళ్లుగా వివాదం నడుస్తున్నది.  దీనిపై స్థానికంగా కోర్టులో కేసులు కూడా దాఖలయ్యాయి.  అయితే, వివాదం మాత్రం పరిష్కారం కాలేదు.  దీనిపై ఇప్పుడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి.  ఈ నెల 30 వ తేదీన మథుర విషయంపై కోర్టు విచారణ చేయబోతున్నది. మరి ఈ కేసు ఎప్పటికి పరిష్కారం అవుతుందో చూడాలి.