శ్రీశైలం డ్యామ్‌ క్రస్ట్ గేట్లపై నుంచి నీరు

శ్రీశైలం డ్యామ్‌ క్రస్ట్ గేట్లపై నుంచి నీరు

ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది... శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతోంది వరద నీరు.. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3.8 లక్షల క్యూ సెక్కులు ఉండగా.. దీంతో శ్రీశైలం డ్యామ్ దగ్గర ఆరు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే, శ్రీశైలం డ్యామ్ దగ్గర క్రస్ట్ గేట్ల పైనుంచి వరద నీరు దూకుతోంది.. అధికారులు ఎవరూ అక్కడ అందుబాటులో లేకపోవడం చర్చగా మారింది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.9 అడగులకు చేరింది. ఆరు గేట్లను మాత్రమే ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో మిగతా గేట్ల పై నుంచి నీరు కిందకు వెళ్లిపోతోంది. అయితే, దీంతో డ్యామ్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. అధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండోసారి అంటున్నారు.