బాలయ్య నో చెప్పిన సినిమాలో చిరు!

బాలయ్య నో చెప్పిన సినిమాలో చిరు!

టాలీవుడ్ హీరోలు తమ సినిమాలు విషయంలో జోరు చూపిస్తున్నారు. ఒకే సారి కుదిరినన్ని సినిమాలు ఓకే చేసేస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అన్న భేధాలు లేకుండా అందరి కథలు వింటున్నారు. అందులో చిరు మరింత దూకుడు కనబరుస్తున్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చనప్పటి నుంచి వురుస సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాతో కలిపి నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు. తాజాగా కృష్ణ వంశీ చిరుకి ఓ కథ వినిపించడాలనికి రెడీ అవుతన్నారంట. కొన్నేళ్ల క్రితం వంశీ రైతు అనే కథను సిద్దం చేసుకొని అందులో బాలకృష్ణ హీరోగా అనుకున్నారంట. అంతేకాకుండా అందులో ఓ పాత్రకి బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్‌ను అనుకున్నారు. కానీ అమితాబ్ ఆ పాత్రకు ఓకే చెప్పకపోవడంతో బాలయ్య కూడా నో అనేశారంట. దాంతో ఇప్పుడు అదే కథను చిరు బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా సిద్దంచేస్తున్నారంట కృష్ణ వంశీ. ఈ కథకు చిరు ఓకే అంటే సినిమాని వచ్చే ఏడాది చివరికి ప్రారంభించాలని వంశీ చూస్తున్నారంట. మరి ఈ సినిమాకి చిరు ఓకే చెప్తారా లేదా అనేదానికోసం వేచి చూడాలి.