ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలు ఇలా...

ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలు ఇలా...

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య శ్రీశైలం డ్యామ్‌, నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని నీటిని పంపిణీ చేసింది కృష్ణానది జలాల యాజమాన్య బోర్డు. తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 8 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 38.90 టీఎంసీల నీటిని వాడుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు శ్రీశైలం నుంచి 6.69 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 26.71 టీఎంసీల నీటిని వాడుకోవాలని ఆదేశించింది కృష్ణా నది యాజమాన్య బోర్డు.