తెలంగాణలోకి ప్రవేశించిన కృష్ణమ్మ...

తెలంగాణలోకి ప్రవేశించిన కృష్ణమ్మ...

కృష్ణా జలాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించాయి... కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి మూడు రోజుల క్రితం విడుదలైన కృష్ణా జలాలు ఇవాల నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం దగ్గర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయచూరు జిల్లాలోని గిరిజాపూర్ బ్యారేజీ నుండి కర్ణాటక అధికారులు నీటిని కిందకి వదిలారు.. రేపటి వరకు కృష్ణా నీళ్లు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్ధన మేరకు,.. ఉమ్మడి మహబూబ్ నగర్ తాగునీటి అవసరాల కోసం కర్ణాటక సర్కార్ నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.