పరమహంస పాత్రలో రెబల్ స్టార్!

పరమహంస పాత్రలో రెబల్ స్టార్!

కృష్ణంరాజు సినిమాల్లో కీలక పాత్ర పోషించి కొన్ని సంవత్సరాలు అయ్యింది. కాస్తంత పెద్ద పాత్ర అంటే.. ఆయన 'రుద్రమదేవి' మూవీలో పోషించిందే. అయితే తమ సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న 'రాథేశ్యామ్' మూవీలో ఆయన పరమహంస అనే పాత్రలో కనిపించబోతున్నారు. కృష్ణంరాజు, ప్రభాస్ కాంబినేషన్ లో ఐదారు సన్నివేశాలు ఉండబోతున్నాయి. ఈ సీన్స్ మినహా సినిమా మొత్తం పూర్తయ్యింది. ఈ ప్రత్యేక పాత్ర కోసం కృష్ణంరాజు గెడ్డం పెంచుతున్నారు. సినిమాలో ఈ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న 'రాథేశ్యామ్' చిత్రం సమ్మర్ స్పెషల్ గా విడుదలవుతుందని కృష్ణంరాజు తన పుట్టిన రోజు సందర్భంగా తెలిపారు. యు.వీ. క్రియేషన్స్ ప్రమోద్, వంశీతో కలిసి కృష్ణంరాజు కుమార్తె ప్రసీద కూడా ఈ చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.