ప్రభాస్ జాన్ రిలీజ్ ఇప్పట్లో లేనట్టే ?

ప్రభాస్ జాన్ రిలీజ్ ఇప్పట్లో లేనట్టే ?

 

దాదాపు 350కిపైగా చిత్రాల్లో నటించి రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకోవడమే కాక, నిర్మాతగానూ పదుల సంఖ్యలో హిట్‌ చిత్రాలు నిర్మించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టిన రోజు ఈనెల 20న తేదీ. అయితే ఆయన 80వ పుట్టిన రోజుని పురస్కరించుకుని రెండు రోజుల ముందుగానే శనివారం హైదరాబాద్‌ ఎఫ్ఎన్సీసీలో పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. సతీసమేతంగా హాజరైన కృష్ణంరాజు కేక్ కట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. తమ బ్యానర్ నుండి రాబోతున్న ప్రభాస్‌ కొత్త సినిమా అంచనాలకు తగ్గట్లుగానే రూపొందిస్తున్నామని కృష్ణం రాజు తెలిపారు. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. ఇప్పటికే యూరోప్‌లో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది.

మరో మూడు నెలల పాటు ఇక్కడే చిత్రీకరణ ఉంటుందని, ఏప్రిల్, మే నెలల్లో విదేశాల్లో చిత్రీకరణకు వెళ్తామని ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. గురువును మించిన శిష్యుడు.. తండ్రిని మించిన తనయుడు.. అంటుంటారు కదా. ప్రభాస్‌ కూడా అలాంటి వాడేనన్న ఆయన నేను హీరోగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సీమల్లో గుర్తింపు తెచ్చుకున్నా ప్రభాస్‌ ఏకంగా దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని, అభిమాన గణాన్ని సృష్టించుకున్నాడని అన్నారు. అలాగే తను కూడా ప్రభాస్ సినిమాలో ఓ కీలక పాత్రనుl పోషిస్తున్నానని అన్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ భాజపాతో పొత్తు పెట్టుకోవడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు.