ప్రభాస్ పెళ్లి.. లైవ్ లో సీరియస్ అయిన కృష్ణం రాజు !

ప్రభాస్ పెళ్లి.. లైవ్ లో సీరియస్ అయిన కృష్ణం రాజు !

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ గా మారింది అంటే అది ప్రభాస్ పెళ్లి అనే చెప్పాలి. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న. ఈ రోజు కృష్ణంరాజు 81వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీవీ లైవ్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను ఆడియన్స్ తో పంచుకున్నారు. రాధేశ్యామ్ సినిమాలో తను నటిస్తున్న పాత్ర గురించి ఆయన కొన్ని కీలక విషయాలు కూడా ప్రేక్షకులతో  పంచుకున్నారు. తన పాత్రకు గడ్డం అవసరం కావడంతో గడ్డం మెయింటేన్ చేస్తున్నానని అని చెప్పుకొచ్చారు.

అయితే చిట్ చాట్ లో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అడగగా ఆయన కాస్త సీరియస్ అయ్యారు. వెంటనే తడుము కోకుండా అయినప్పుడు అంటూ సమాధానం చెప్పేశారు. వెంటనే కాస్త షాక్ అయిన యాంకర్ అలా కాదు ఆయన పెళ్లి కోసం ఆయన ఫ్యాన్స్ అందరూ బాగా ఎదురు చూస్తున్నారు కదా అంటూ అడగగా అవునని ఆయన పెళ్లి కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానని కానీ అది ఎప్పుడు అంటే తాను చెప్పలేనని అని చెప్పుకొచ్చారు. అవనీయండి అయినప్పుడే చూద్దామని ఆయన తేల్చి చెప్పారు. ప్రభాస్ పెళ్లి విషయంలో కృష్ణం రాజు సంతోషంగా లేరని కొద్ది రోజుల నుండి జరుగుతున్న ప్రచారానికి కృష్ణం రాజు సమాధానం ఊతం ఇచ్చినట్టు అయింది.