నెక్స్ట్ స్టార్ హీరోతోనే !

నెక్స్ట్ స్టార్ హీరోతోనే !

'గమ్యం, వేదం, కంచె' లాంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు క్రిష్.  కానీ ఆయన దర్శకత్వం వహించిన 'ఎన్టీఆర్' సిరీస్ బాక్సాఫీస్ ముందు ఘోరంగా విఫలమైంది.  'కథానాయకుడు, మహానాయకుడు' రెండు భాగాలు పూర్తిగా విఫలమయ్యాయి.  ఈ పరాజయం క్రిష్ మీద బాగానే ప్రభావం చూపింది.  అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్న ఆయన కొత్త కథను సిద్ధం చేసుకుంటున్నారట.  ఈసారి చిన్న నటీనటులతో కాకుండా స్టార్ హీరోతో సినిమా చేయాలని ఆయన భావిస్తున్నారట.  ఆ స్టార్ హీరో ఎవరనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.