కవిత రాసిన కృతి.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

కవిత రాసిన కృతి.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

సూపర్ స్టార్ మహేష్ బాబు 1నేనొక్కడినేతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకపోయినా ఈ సినిమాతో కృతీకి తెలుగులో మంచి పేరు వచ్చింది. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న అతి తక్కువ హీరోయిన్ల జాబితాలో చేరింది. ఆ తరువాత నాగచైతన్య సరసన దోచేయ్ అంటూ అందరి హృదయాలను దోచేసింది. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ కావడంతో కృతి టాలీవుడ్‌కు దూరమైంది. ఈ అమ్మడు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం అక్షయ్ సరసన బచ్చన్ పాండే సినిమలో చేస్తోంది. ఈ ముద్దుగుమ్మకి సోషల్ మీడియాలో బీభత్సంగా ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో అమ్మడు అప్పుడప్పుడు కొన్న వితలు రాసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటోంది. అదే తరహాలో ఇటీవల కృతి రాసిన కవిత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇటీవల తన ఫొటోను షేర్ చేసిన కృతి ఆ ఫోటో కింద తన కవితను రాసింది. ‘ఆమె కళ్ళు లోతైనవి. నాజాతీతో నిండిఉన్న ఆకళ్ళు ఎన్నటికీ మారవు. ఆమె అటువంటి ప్రేమ కోసం ఎదురుచూస్తోంది’ అంటూ కృతి రాసిన కవిత అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ కవిత నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు దాదాపు 9లక్షలకు పైగా లైకులు వచ్చాయి. నటిగా తనను తాను నిరూపించుకున్న కృతి ఇప్పుడు కవయిత్రగా కూడా నిరూపించుకోనుంది. ప్రస్తుతం ఈ కవిత చదివిన వారు అమ్మడుకి ఫిదా అవుతున్నారు.