హరీష్‌రావుతో విభేదాలపై కేసీఆర్‌ క్లారిటీ..

హరీష్‌రావుతో విభేదాలపై కేసీఆర్‌ క్లారిటీ..

మరో పదిహేనేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. హరీష్‌రావుతో తనకు విభేదాలు లేవని.. విపక్షాలు ఆయనపై దిక్కుమాలిన ఆరోపణలు చేశామని విమర్శించారు. హరీష్‌కు, తనకు కుటుంబమే ఫస్ట్‌ అని.. ఆ తర్వాతే రాజకీయాలని కేటీఆర్‌ తెలిపారు. 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమన్న కేటీఆర్‌.. డిసెంబర్‌ 11న 100 సీట్లను తామే గెలవబోతున్నామని చెప్పారు.  మహకూటమి పుంజుకునే ప్రసక్తే లేదన్నారు. సెటిలర్స్‌ తమ వైపు ఉన్నారని.. అందుకే చంద్రబాబు అభద్రతాభావంతో ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. బీజేపీ ఐదు సిట్టింగ్‌ స్థానాల్లో తామే గెలుస్తామన్నారు.