హైదరాబాద్‌కు నీటి కరువు రాదు - కేటీఆర్

హైదరాబాద్‌కు నీటి కరువు రాదు - కేటీఆర్

రెండు మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో ఇంకో 48 రోజుల తర్వాత నీరు ఉండదనే వార్తలు సోషల్ మీడియాలో బాగా హడావుడి చేశాయి.  భూగర్భ జలాలు ఎండిపోవడం, రిజర్వాయర్లలో నీరు వచ్చి చేరే పరిస్థితి లేకపోవడంతో తీవ్రమైన నీటి ఎద్దడి తప్పదని, చెన్నై నగరం మాదిరిగా హైదరాబాద్ కరువును ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.  దీంతో జనంలో కంగారు మొదలైంది.  

సినీ దర్శకుడు మారుతి సైతం స్పందిస్తూ ఈ వార్త నిజమేనా సర్ అంటూ ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌ను అడిగారు.  దీనికి స్పందించిన కేటీఆర్ ఆ వార్తల్లో నిజం లేదు.. ఇంకో రెండు వారాల్లో కాళేశ్వరం నీరు ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి వస్తుంది. దీని ద్వారా హైదరాబాద్‌కు రోజుకు 172 మిలియన్‌ గ్యాలన్ల నీరు అందుతుంది.  ప్రజలు కూడా నీటి ప్రాముఖ్యతను గుర్తించి జాగ్రత్తగా వాడుకోవాలి అన్నారు.