ఇవాళే కేటీఆర్-జగన్‌ భేటీ..

ఇవాళే కేటీఆర్-జగన్‌ భేటీ..

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని జగన్ నివాసంలో మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం జరగనుంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టిన గులాబీఅధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌.. ఇప్పటికే వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరపగా... అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ చర్చలు జరపాలని నిర్ణయానికి వచ్చారు. వైసీపీ అధినేత  జగన్‌ను చర్చలు జరపాల్సిందిగా కేటీఆర్‌కు సూచించారు. దీంతో రాజకీయంగా తొలిసారి కేటీఆర్.. జగన్‌తో చర్చలు జరపనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కేటీఆర్‌తో ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలు ఈ భేటీకి హాజరుకానున్నారు.