అమరావతి రాజధాని అంశం : తెలివిగా సమాధానం చెప్పిన కేటీఆర్

అమరావతి రాజధాని అంశం : తెలివిగా సమాధానం చెప్పిన కేటీఆర్

ఏపీ రాజధాని అమరావతి మీద సంధిగ్ధ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రాజధాని అంశం మీద మంత్రి కేటీఆర్ స్పందించారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఆ ప్రశ్నకు ఆయన తెలివిగా స్పందించారు. ఈరోజు గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్టీవీలో ప్రత్యేకంగా డిబేట్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని గా ఉంటుందా ఉండదా అన్న సందిగ్ధత నేపథ్యంలోనే హైదరాబాద్ కి పెట్టుబడులు పెరుగుతున్నాయని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన తెలివిగా సమాధానం ఇచ్చారు.

ఆ సందిగ్దత హైదరాబాద్ కి కలిసి వచ్చిందని తాను అనుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను అని అదేమిటంటే బిజెపి అక్కడ ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసిందని ఇక్కడ తెలంగాణా ని మోసం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.. ఈ సందర్భంగా ఒక పాత విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అమరావతి శంకుస్థాపన సమయంలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసీఆర్ ని ఆహ్వానించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ అక్కడికి వెళ్ళాలా వద్దా అనే మీమాంస క్యాబినెట్ లో ఉందని, ఈ అంశం మీద చాలా చర్చ జరిగింది అని చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ మాత్రం తాను వెళతానని వాళ్లు విడిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదని మన కోరిక మేరకు విడిపోయింది మనమే కాబట్టి వాళ్ళ కొత్త ఇంటికి వెళ్లి కానుకలు సమర్పించి వస్తానని ఆయన పేర్కొన్నారట.

అలాగే 100 కోట్ల రూపాయిలు కానుకగా ప్రకటించాలని కూడా క్యాబినెట్ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రధాని ఒట్టి చేతులతో నీళ్ళు మట్టి తీసుకువచ్చి అక్కడి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. ప్రధాని ఎటువంటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించకుండా కేసీఆర్ గారు ప్రకటిస్తే బాగోదు అని ఆయన కూడా వెనక్కి వచ్చేశానని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి వ్యవహారాలు చూసుకుంటున్నారు కాబట్టి ఈ అంశాల మీద తానే మీ కామెంట్ చేయనని ఆయన చెప్పుకొచ్చారు.