కిషన్ రెడ్డి తల్లి అంత్యక్రియలకు కేటీఆర్

కిషన్ రెడ్డి తల్లి అంత్యక్రియలకు కేటీఆర్

బీజేపీ సీనియర్ నేత జి. కిషన్ రెడ్డి తల్లి గంగాపురం అండాలమ్మ అంత్యక్రియలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హజరుకానున్నారు. గురువారం మధ్యాహ్నం 2గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురంలో అంత్యక్రియలు జరగనున్నాయి. బుధవారం అర్ధరాత్రి అండాలమ్మ అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డి మాతృవియోగంపై పలువురు నాయకులు సంతాపం తెలిపారు. బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నాయకులు ఎల్ కే అద్వాణీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తదితరలు ఫోన్ లో సంతాపం తెలిపారు. తిమ్మాపూర్ గ్రామానికి విచ్చేసి కిషన్ రెడ్డి గారిని పరామర్శించారు.