ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన...వెయిటింగ్ అట !

ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన...వెయిటింగ్ అట !

మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. గత నాలుగు రోజులుగా దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్ పలు విదేశీ పెట్టుబడులపై  చర్చించారు. తన పర్యటనలో భాగంగా అనేక ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన మంత్రుల్ని కలిశారు. 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని పిరమిల్ గ్రూప్ కేటీఆర్ కు చెప్పింది.  దావోస్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ సుమారు 50కి పైగా సమావేశాలతో పాటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 5 చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేటీఆర్. ఆల్ఫాబెట్ , గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోకాకోలా సీఈవో జేమ్స్ క్వేన్సీ , సేల్స్ ఫోర్స్ స్థాపకుడు చైర్మన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్కికి లాంటి కార్పొరేట్ దిగ్గజాల తో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రాముఖ్యత, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి.. పెట్టుబడులు పెట్టాలని కోరారు కేటీఆర్. 

తెలంగాణలో ప్రగతిశీల విధానాలున్నాయని కేటీఆర్ వివరించారు. వివిధ పరిశ్రమలకు ఇక్కడ అందుబాటులో ఉన్న వనరులను గురించి చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ సుస్థిరమైన వృద్ధిరేటుతో ముందుకు పోతుందని వివరించారరు. కొన్నేళ్లుగా బెస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ ఉంటోందని కూడా విదేశీ పెట్టుబడిదారులకు గుర్తుచేశారు కేటీఆర్. పిరమల్ గ్రూప్ కి సంబంధించి ఐదు వందల కోట్ల పెట్టుబడితో పాటు అనేక ఇతర కంపెనీలు తెలంగాణ పట్ల ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు కేటీఆర్. భారత్ నుంచి మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు కూడా సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ తెలంగాణ భారీ ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించగలిగిందన్నారు. కేటీఆర్ దావోస్ టూర్ విజయవంతంగా జరిగిందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.