ఎండాకాలంలో కూడా వాళ్లకు చలి జ్వరం: కేటీఆర్‌

ఎండాకాలంలో కూడా వాళ్లకు చలి జ్వరం: కేటీఆర్‌

'కారు..సారు..పదహారు..ఢిల్లీలో సర్కార్‌..ఇదే మన నినాదం' అని అన్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ 16 ఎంపీ స్థానాలు గెలిచి ఢిల్లీ గద్దెను శాసిద్దామన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ ఎంపీలు గెలిస్తే వారు ఢిల్లీకి గులామ్‌లుగా మారుతారని అన్నారు. 'కాంగ్రెస్ ఎంపీలకు రాహుల్ గాంధీ ఉస్కో అంటే ఉస్కో.. డిస్కో అంటే డిస్కో' అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కకావికలం అయిందని.. ఎన్నికలంటే ఎండా కాలంలో కూడా ఆ పార్టీ నేతలకు చలి జ్వరం వస్తోందని ఎద్దేవా చేశారు.  

ఢిల్లీలో ఎర్రకోటపై జెండా ఎవరు ఎగురవేయాలో మనం నిర్ణయించే పరిస్థితి ఉంటే మన రాష్ట్రానిక ప్రాజెక్టులు రావా? అని ప్రశ్నించారు కేటీఆర్‌. కేంద్రాన్ని రూ.24 వేల కోట్లు అడిగితే.. 24 పైసలు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్‌, బీజేపీ ఉన్నదని.. తమతో కలిసి వచ్చే పార్టీలు చాలా ఉన్నాయని కేటీఆర్‌ చెప్పారు.