జగన్‌ కష్టం ఫలించింది-కేటీఆర్

జగన్‌ కష్టం ఫలించింది-కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం వైపు దూసుకుపోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల దీవెనెల రూపంలో వైఎస్ జగన్ కష్టం ఫలించిందని పేర్కొన్న కేటీఆర్... సోదర రాష్ట్ర పరిపాలనలో మంచి జరగాలని ఆకాంక్షించారు.