తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..త్వరలో ఇంటింటికీ ఇంటర్నెట్.!

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..త్వరలో ఇంటింటికీ ఇంటర్నెట్.!

తెలంగాణలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలు కల్పిస్తామని ఐటి,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు పట్టాలు పంపిణి చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో టీ -ఫైబర్ పనులు  కొనసాగుతున్నాయని అన్నారు. త్వరలోనే ఇంటర్నెట్ సేవలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయమైన వాటాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాడుకుంటున్నామన్నారు. రైతులకు దీర్ఘకాల మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయాన్ని పండగ చేయడమే కేసీఆర్ లక్ష్యమని వ్యాఖ్యానించారు. కరోనా కష్టసమయంలో సైతం రైతు బందు అందజేశామని అన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్‌ అని మంత్రి వ్యాఖ్యానించారు.