అమిత్‌ షాతో కేటీఆర్ భేటీ

అమిత్‌ షాతో కేటీఆర్ భేటీ

ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు కేటీఆర్‌. కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసిన మంత్రి కేటీఆర్ రసూల్‌పురాలో ఫ్లైఓవర్ నిర్మాణ స్థలం ఇవ్వాలని కోరారు. ఇంటర్ స్టేట్ పోలీస్ వైర్‌లెస్ స్టాఫ్ క్వార్టర్స్‌ల స్థలాన్ని జీహెచ్‌ఎంసీకి ఇవ్వాలని అన్నారు మంత్రి కేటీఆర్. మరోచోట స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి స్థలం ఇస్తామని అమిత్‌ షాకు తెలిపారు. అటు రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ హైదరాబాద్ లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను అభ్యర్థించారు కేటీఆర్. మౌలిక సదుపాయాల కల్పనకు DPIIT కింద నిధులు సమకూర్చలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో గ్రానైట్ రవాణాకు రైల్వే సైడింగ్ సదుపాయం కల్పించాలని, హైదరాబాద్-విజయవాడ ప్యాసింజర్ రైలును కేటాయించాలని కేటీఆర్ కోరారు.