కవిత ఓటమికి కారణం రైతులు కాదు..

 కవిత ఓటమికి కారణం రైతులు కాదు..

నిజామాబాద్ ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కవిత ఓటమి పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కవిత ఓటమికి కారణం రైతులు కాదని స్పష్టం చేశారు. అక్కడ నామినేషన్లు వేసింది రైతులు కాదు.. రాజకీయ కార్యకర్తలే అని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్‌ నేత ఇంటి నుంచి 93 మంది నామినేషన్లు పడ్డాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కువల్లే కవిత ఓడిపోయారని అన్నారు. 

'నేను, కవిత అనేక డక్కామొక్కీలు తిన్నాం. ఒక్క ఓటమితో కుంగిపోం. తెలంగాణ ఏపీ మధ్య సత్సంబంధాలు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగి ఉంటే తెరాసకు నష్టం అనే దానితో ఏకీభవించను. ఒడిశాలో రెండు ఎన్నికలు కలిపి వచ్చినా అక్కడ నవీన్‌ పట్నాయక్‌ గెలిచారు' అని కేటీఆర్‌ స్పష్టంచేశారు.