మూడో టెస్ట్ పై మంత్రి కేటీఆర్ రియాక్షన్...

మూడో టెస్ట్ పై మంత్రి కేటీఆర్ రియాక్షన్...

ఆసీస్-భారత్ మధ్య జరిగిన మూడో టెస్ట్ డ్రా అయిన విషయం తెలిసిందే. అయితే డ్రా అయినా ఇది భారత్‌కు నైతిక విజయం. అంతకన్నా కూడా విలువైందే. ఎందుకంటే.. సగం జట్టుకు గాయమైనా.. గాయాలతో ఆడడం కష్టంగా ఉన్నా రోజంతా పోరాడింది. అయితే ఈ మ్యాచ్ లో గాయం తర్వాత కూడా తన బ్యాటింగ్ కొనసాగించిన హనుమవిహారి ఆట తీరుపై మంత్రి కేటీఆర్ కూడా హర్షం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ, పట్టుదల, ధైర్యాన్ని కొనియాడారు. ఒకవైపు ఆటగాళ్లు  గాయాల బారిన పడినా, మరోవైపు జాత్యంహకార వ్యాఖ్యలు ఎదురైనా... ఏవీ జట్టు స్ఫూర్తిని దెబ్బతీయలేదని ప్రశంసించారు. ఈ డ్రా.. ఇన్నింగ్స్‌ విజయం కన్నా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన విహారి... కేటీఆర్‌కు ధన్యవాదాలు చెప్పాడు.