టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతోనే ఆయన గెలిచాడు..

టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతోనే ఆయన గెలిచాడు..

ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ దేశ వ్యాప్తంగా పడిపోతోందన్నారు తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీ రామారావు... హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం రోడ్ షోలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌తో కలిసి పాల్గొన్న ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ... నాలుగున్నర సంవత్సరాల్లో హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కిందన్నారు. తెలంగాణ ఏర్పడే సమయంలో అనేక అపోహలు టీఆర్ఎస్ పై సృష్టించారన్న ఆయన... బీజేపీ నుంచి రామచంద్రరెడ్డిని ఆ పార్టీపై ప్రేమతో కాదు... టీఆర్ఎస్ పై కోపంతో 2014లో గెలిపించారని తెలిపారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్‌ హయాంలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయన్న కేటీఆర్... ఈ నాలుగున్నరేళ్లలో 4 సెకండ్లు కూడా కర్ఫ్యూ పెట్టలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చనన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ ని వెతుక్కుంటూ వస్తున్నాయని వెల్లడించిన కేటీఆర్... అందుకు కారణం రాజకీయ స్థిరత్వమే కారణమన్నారు. దానం నాగేందర్‌ను గెలిపిస్తే... ఖైరతాబాద్ నియోజకవర్గంలో మొదట వచ్చి డబుల్ బెడ్ రూమ్ లకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ లో మంచినీటి సరఫరా బాగ చేసుకున్నామని ఈ సందర్భంగా తెలిపిన కేటీఆర్... చింతల రామచంద్ర రెడ్డి చెబుతున్న అభివృద్ధి అంతా టీఆర్ఎస్ చేసిందే అన్నారు.