రేపటి నుంచి గ్రేటర్ లో కేటీఆర్ రోడ్ షోలు

రేపటి నుంచి గ్రేటర్ లో కేటీఆర్ రోడ్ షోలు

గ్రేటర్ పరిధిలో మంత్రి కేటీఆర్ రోడ్ షోలకు ప్రణాళిక సిద్ధమైంది. రేపటి నుంచి 29వ తేదీ వరకు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున మొత్తం 14 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి-హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా రూపొందించే ప్రణాళికలు, రాబోయే మూడేళ్లలోనే 50వేల కోట్ల అభివృద్ధి ప్రణాళికలను ప్రజలను వివరించనున్నారు. ఈ నెల 25న ఇబ్రహీంపట్నంలో, వచ్చే నెల 3న జరిగే పరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. యువనేత ప్రచారంతో గులాబీ పార్టీ అభ్యర్థులకు మరింత కలిసి రానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.