తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఆ ఇద్దరే..

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఆ ఇద్దరే..

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఇద్దరు వ్యక్తులేనని.. ఒకరు ఎన్టీఆర్‌...మరొకరు కేసీఆర్‌ అని అన్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేటీఆర్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌.. టీడీపీని స్థాపించినప్పటి పరిస్థితులు వేరని, కేసీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ పరిస్థితులు వేరని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత ఉందని, ఎన్టీఆర్‌ సినిమా స్టార్ కావడంతో ఆ గ్లామర్‌ తోడైందన్నారు. కేసీఆర్‌కు ఎలాంటి అనుకూలతలూ లేవని అన్నారు.  సామాజిక నేపథ్యం ,ఆర్థిక వనరులు లేకున్నా విజయం సాధించిన వ్యక్తి కేసీఆర్‌ అని చెప్పారు.