కేటీఆర్‌ బర్త్‌డే స్పెషల్.. అరుదైన ఫొటోలు

కేటీఆర్‌ బర్త్‌డే స్పెషల్.. అరుదైన ఫొటోలు

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ పొలిటీషియన్‌ కేటీఆర్‌ పుట్టిన రోజు ఇవాళ. 1976 జూలై 24న కేసీఆర్, శోభా దంపతులకు జన్మించిన కేటీఆర్ తన విద్యాభ్యాసాన్ని కరీంనగర్, హైదరాబాద్‌లలో పూర్తి చేశారు. నిజాం కాలేజీలో బీఎస్సీ మైక్రో బయాలజీ.. పుణె యూనివర్శిటీ నుంచి ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ పూర్తి చేశారు. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి మేనేజమ్‌మెంట్ అండ్ ఈ కామర్స్‌లో ఏంబీఏ పట్టా పొందారు. అనంతరం ఇంట్రా అనే సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా అమెరికాలోనే కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. 2006లో భారత్‌ తిరిగి వచ్చారు. 2006 నుంచి 2009లో టీఆర్ఎస్‌లో సామాన్య కార్యకర్తగా ఉంటూ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2009లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో గెలిచాక మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా కొన్ని అరుదైన ఫొటోలు ఇవే..