మల్టీ లెవల్ ప్లై ఓవర్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన

మల్టీ లెవల్ ప్లై ఓవర్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ కొండాపూర్ లో రూ. 263 కోట్లతో నిర్మిస్తున్న మల్టీ లెవల్ ప్లై ఓవర్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు గచ్చిబౌలి నుంచి హాఫిజ్ పేట మార్గంలో నాలుగు లైన్ల ఫ్లై ఓవర్ ను నిర్మించనున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల కొండాపూర్ చౌరస్తా, బొటానికల్ గార్డెన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, నగరంలో 23వేల కోట్లతో 54 జంక్షన్లను వృద్ధి చేస్తున్నామని, పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ప్రజా రవాణా ఆశించిన స్ధాయిలో లేదు. 34 శాతం స్వంత వాహనాల్లోనే ప్రయాణం చేస్తున్నారు. ముంబయి లాంటి నగరాల్లో 70శాతం మంది ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నారని అన్నారు. మన మెట్రో ద్వారా రోజుకు 12 నుంచి 14 లక్షల మంది భవిష్యత్ లో ప్రయణిస్తారని ఆశిస్తున్నాం. అమీర్ పేట్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో మార్గాన్ని ఆగస్ట్ లో ప్రారంభి, అమీర్ పెట్ నుంచి హైటెక్ సిటీ వరకు ఉన్న మెట్రో మార్గాన్ని  సెప్టెంబర్, అక్టోబర్ లో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్, జగదీశ్ గౌడ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.