ఆమెకు మాటిచ్చి నిలబెట్టుకున్న కేటీఆర్

ఆమెకు మాటిచ్చి నిలబెట్టుకున్న కేటీఆర్

మాటిచ్చిన నెల రోజుల్లోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకున్నారు. కండరాల క్షీణత (మస్కులర్ డిస్ట్రోఫీ)తో బాధపడుతున్న షేక్ నఫీస్ బేగం కు గత నెల 4వ తేదీన సాయం చేస్తానని మాట ఇచ్చిన కేటీఆర్.. సరిగ్గా నెల రోజుల్లోనే ఆమెకు నెలకు రూ. 10 వేల సాయం అందజేస్తూ మాట నిలబెట్టుకున్నారు. సాంస్కృతిక శాఖ తరఫున నెలకు రూ. 10 వేల పెన్షన్ అందేలా జీవో జారీ చేయడంతో నఫీస్ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. 

స్వతహాగా పెయింటర్ అయిన నఫీస్.. గత నెల ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. దానికి కేటీఆర్ ను కూడా ఆహ్వానించారు. ఆమెలోని కళాభినివేశాన్ని కేటీఆర్ ఎంతగానో ప్రశంసించారు. నఫీస్ తన చిత్రపటం వేసి గిఫ్ట్ గా ఇచ్చినందుకు కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆమె మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతూ కూడా కుటుంబం గడవడానికి పెయింటింగ్ వేస్తూండడం కేటీఆర్ ను బాగా ఆలోచింపజేసింది. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ కూడా చెల్లెలి జీవితం కోసం కుంచె పడుతున్న నఫీస్ కు.. ప్రతినెలా వైద్య ఖర్చుల కోసం పనికొచ్చేలా రూ. 10 వేల పెన్షన్ మంజూరు చేయించారు.