వరంగల్ ప్రజలకు కేటీఆర్ తీపి కబురు

వరంగల్ ప్రజలకు కేటీఆర్ తీపి కబురు

 

వరంగల్ ప్రజలకు పురపాలక మంత్రి కే తారకరామారావు తీపి కబురు తెలిపారు. గ్రెటర్ వరంగల్ కార్పొరేషన్‌లో వచ్చే ఉగాది నుంచి తాగునీటి సరఫరా ప్రతిరోజు ఉండేలా ప్రయోగాత్మకంగా ప్రయోగిస్తామని ఆయన తెలిపారు. దీనిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసి ఉన్నత స్థాయి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్‌లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల గురించి అనేక శాఖల అధికారులు సమీక్షించారు. ఈ క్రమంలో వరంగల్ నగర పరిధిలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు ప్రజలకు అందించాలని, అదే తమ లక్ష్యంగా కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఉగాది నాటికి నగరంలో ప్రతి రోజు తాగునీరు అందుబాటులోకి రావాలని, అదే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని, దానికి కావలసిన మౌలిక అవసరాలను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. వీటితో పాటుగా వరంగల్‌లో తాగునీటి సరఫరాను మెరుగు పరిచేందుకు అనే చర్చలు తీసుకుంటున్నామని తెలిపారు.