ప్రవీణ్ ఓ మానవ మృగం.. ఉరి సరైన నిర్ణయమే..

ప్రవీణ్ ఓ మానవ మృగం.. ఉరి సరైన నిర్ణయమే..

వరంగల్ లో అభంశుభం ఎరుగని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి.. హత్యచేసిన ప్రవీణ్ కు వరంగల్ జిల్లా కోర్ట్ ఉరిశిక్ష విధించింది.  ప్రవీణ్ కు ఉరిశిక్ష విధించడాన్ని ప్రజలు సమర్థిస్తున్నారు.  పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని నిందితుడిని పట్టుకున్నారు.  కోర్టుకూడా ఈ కేసును చాలా స్పీడ్ గా విచారించింది.  చేసిన తప్పును ఒప్పుకోవడంతో ప్రవీణ్ కు ఉరిశిక్ష విధించింది జిల్లా కోర్ట్.  

జిల్లా కోర్టు విధించిన ఉరిశిక్షను తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు.  మానవ మృగానికి ఉరిశిక్ష వేయడం సబబే అన్నారు.  ప్రవీణ్‌ను మానవమృగంగా కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ప్రమోద్ కుమార్ అనే నెటిజన్‌ ట్విటర్‌ లో స్పందించారు. కేటీఆర్‌ నుంచి ఇలాంటి స్పందన ఊహించలేదన్నారు.  దోషి ప్రవీణ్‌ పుట్టుకతోనే మృగమా.. అతన్ని మృగంలా మార్చడంలో సమాజం పాత్ర ఏమిటి? అని ప్రశ్నించారు.  దీనికి కేటీఆర్ ఘాటైన రిప్లై ఇచ్చాడు.  కొన్నింటిని క్షమించకూడదని,  తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడని, అంతకన్నా హీనం ఉంటుందా? అని ప్రశ్నించారు.కేటీఆర్.