మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన కేటీఆర్..!

మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన కేటీఆర్..!

హెచ్ఎండిఏ ఉచితంగా పంపిణి చేస్తున్న మట్టి వినాయక విగ్రహాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. హెచ్ఎండిఏ పరిధిలోని 32 సెంటర్లలో ఉచితంగా 50 వేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ఈ ఏడాది 8 ఇంచుల ఎత్తు గల 50 వేల పర్యావరణహిత వినాయక(మట్టి) విగ్రహాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. తొలి వినాయక విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్ గారికి అందజేశారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది కోవిడ్–19 పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు అమలులో ఉన్నందున నవరాత్రి ఉత్సవాలను ఎవరి ఇండ్లల్లో వారు భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని సూచించారు. ట్యాంక్ బండ్ హుసేన్సాగర్ శుద్ధి కార్యక్రమంలో భాగంగా రసాయనాల వాడకంతో రూపొందించే వినాయక విగ్రహాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంగా  హెచ్ఎండిఏ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.