సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్‌

సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్‌

టీమిండియా లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్ఠాత్మక హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌ను చేర్చడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఇవాళ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. సచిన్‌తో కలిసి గతంలో దిగిన ఫొటోను ట్యాగ్‌ చేశారు కేటీఆర్‌. 

ఇప్పటి వరకు మన దేశం తరఫున బిషన్ సింగ్ బేడీ (2009), కపిల్‌దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018)కి మాత్రమే హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఇప్పుడీ జాబితాలో సచిన్ టెండూల్కర్ కూడా చేరాడు. ఇక.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 87 మంది ఆటగాళ్లు ఇప్పటి వరకు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకోగా ఇంగ్లండ్‌కి చెందిన ఆటగాళ్లు ఇందులో 28 మంది ఉండడం గమనార్హం.