కన్నీళ్లు పెట్టుకున్న కుల్దీప్‌ యాదవ్‌

కన్నీళ్లు పెట్టుకున్న కుల్దీప్‌ యాదవ్‌

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అదరగొడుతున్న మిస్టరీ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఐపీఎల్‌లో ధారాళంగా పరుగులిస్తున్నాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున బరిలోకి దిగిన ఈ టీమిండియా స్పిన్నర్‌.. ఐపీఎల్‌లో వికెట్లు మాట అటుంచితే... లయ తప్పి బంతులు విసురుతున్నాడు. నిన్న బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్‌ వేసిన నాలుగో ఓవర్‌లో మొయిన్‌ అలీ చితక్కోట్టేశాడు. మూడు సిక్సర్లు రెండు ఫోర్లతో ఏకంగా భారీగా పరుగులు రాబట్టుకున్నాడు. ఈ ఓవర్‌ ముగిసిన వెంటనే గ్రౌండ్‌లోనే కుల్దీప్‌ కన్నీళ్లు పెట్టుకోగా సహచర ఆటగాళ్లు ఓదార్చారు. మొత్తమ్మీ ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ 4 ఓవర్లు వేసి 59 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్‌ తీశాడు.