కుల్దీప్‌ అరుదైన రికార్డు

కుల్దీప్‌ అరుదైన రికార్డు

భారత స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ అరుదైన రికార్డు అందుకున్నాడు. శనివారం న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో వన్డేలో భారత్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. కుల్దీప్‌ నాలుగు వికెట్లతో రాణించి భారత్‌ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 77 వన్డే వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కుల్దీప్‌కు 37వ వన్డే మ్యాచ్‌లలో 77 వికెట్లు తీసాడు.

37 వన్డే మ్యాచ్‌ల తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో కుల్దీప్‌ రెండో స్థానంలో ఉన్నాడు. 37 వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్తాన్‌) మొదటి స్థానంలో ఉన్నాడు. రషీద్‌  37 వన్డేలలో 87 వికెట్లు తీసాడు. ఈ జాబితాలో సక్లయిన్‌ ముస్తాక్‌ (పాకిస్తాన్‌), మిచెల్‌ స్టార్క్‌ ( ఆస్ట్రేలియా)లు సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అజంతా మెండిస్‌ (శ్రీలంక) 72 వికెట్లతో నాలుగవ స్థానంలో.. షేన్‌ బాండ్‌, హసన్‌ అలీలు 71 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

కుల్దీప్‌ యాదవ్‌ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌ గడ్డపై ఒక స్పిన్నర్ రెండు వరుస మ్యాచ్ లలో నాలుగు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. మొదటి వన్డేలో 39 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు, రెండో వన్డేలో 45 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసాడు.