వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో నేను తప్పు చేశా..
వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఓవర్ త్రోకు ఆరు పరుగులు ఇవ్వడం పెద్ద దుమారాన్నే రేపింది. ఇంగ్లండ్ చేజింగ్ చేస్తుండగా చివరి ఓవర్ నాలుగో బంతిని స్టోక్స్ ఆడాడు. బాల్ అందుకున్న మార్టిన్ గప్టిల్ కీపర్ వైపు విసిరాడు. ఆ బాల్ స్టోక్స్ బ్యాటుకు తగిలి నేరుగా బౌండరీ దాటడంతో అంపైర్లు 2 ప్లస్ 4.. కలిపి 6 పరుగులు ప్రకటించారు. ఇలా 6 పరుగులు ప్రకటించడం వివాదాస్పదమైంది. 5 పరుగుల ప్రకటించాల్సిన చోట6 పరుగులు ప్రకటించడంపై మాజీ అంపైర్ సైమన్ టోఫెల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఆ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న ధర్మసేన.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించాడు. 6 పరుగులు ఇవ్వడం పొరపాటేనని అంగీకరించాడు. ఓవర్ త్రో విషయంలో తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని టీవీ రిప్లే ద్వారా తెలుసుకున్నానని చెప్పాడు. లెగ్ అంపైర్ సహాయంతో ఇతర అంపైర్లు, మ్యాచ్ రిఫరీని సంప్రదించానని.. వాళ్లు కూడా టీవీ రిప్లేలో సరిగా పరిశీలించకపోవడంతో తప్పు జరిగిందని అన్నాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)