లాక్‌డౌన్‌ వేళ పెళ్ళిళ్ళు కావాల్సొచ్చాయా ?

లాక్‌డౌన్‌ వేళ పెళ్ళిళ్ళు కావాల్సొచ్చాయా ?

కర్ణాటకలో కరోనా ఆంక్షలు భేఖారయ్యాయి. కేంద్రం ఎట్టిపరిస్ధితిలోనూ శుభకార్యాలకు అనుమతి లేదంటూ చెప్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడి వివాహా వేడుకలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ అన్ని వివాహ శుభకార్యాలు రద్దయ్యాయి. అయినా సరే కుమారస్వామి ఆర్బాటంగా వివాహాన్ని భారీ బందుమిత్రుల సమక్షంలో జరగడం పలు విమర్శలకు తావిస్తోంది.అయితే దీనిపై ప్రభుత్వ స్పందనపై అందరీ దృష్టి పడింది. ఇప్పటి వరకూ కర్ణాటకలో 353 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది మృతి చెందారు.ఈ క్రమంలో 13 హాట్ స్పాట్స్ కూడా అధికారులు గుర్తించారు. ఇలాంటి విపత్కర పరిస్ధితిలో ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ నేతలు ఇష్టారీతిన వ్యవహరించడంపై కన్నడ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాహానికి బెంగళూరు సమీపంలోని రామనగరలో ఉన్న వారి ఫాంహౌజ్‌ వేదికైంది. ఈ వివాహానికి బయటి వారు ఎవ్వరూ హాజరుకానప్పటికీ ఇరు కుటుంబసభ్యుల నడుమ ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహానికి హాజరైన వారు మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదు. అయితే దీనిపై గతంలో కుమారస్వామి పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల మద్య వివాహం జరుగుతుందని చెప్పినా భారీగానే బందువులు హాజరైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వివాహానికి వచ్చిన ఏ ఒక్కరు కూడా మాస్కులు ధరించకపోగా భౌతిక దూరం కూడా పాటించలేదని బయటకు వచ్చిన ఫోటోలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. పెళ్ళికుమార్తె కూడా కాంగ్రెస్‌ నేత బందువు కావడంతో రాజకీయపరంగా ఈ వివాహానికి ప్రాధాన్యత ఏర్పడింది. వివాహ కార్యక్రమంపై కర్ణాటక ప్రభుత్వం ముందుగానే స్పందించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోతే మాత్రం కుమారస్వామిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

కేవలం వందమంది అతిథుల సమక్షంలో ఓ ఫామ్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. అయితే ఈ వివాహ వేడుకపై కర్ణాటక ప్రభుత్వం నివేదిక కోరింది. ఈ పెళ్లి వేడుకలో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపించాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై విమర్శలు వచ్చాయి. దీంతో యడియూరప్ప ప్రభుత్వం రామ్‌నగర్ అధికారుల నుంచి ఈ వివాహ వేడుకపై నివేదిక కోరింది. కరోనా వేళ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వివాహం జరపడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.