ఒక్కో ఎమ్మెల్యేకి 100 కోట్లు.. మంత్రి పదవి..

ఒక్కో ఎమ్మెల్యేకి 100 కోట్లు.. మంత్రి పదవి..

అధికారం కోసం బీజేపీ వెంపర్లాడుతోందని జేడీఎస్‌ నేత కుమారస్వామి అన్నారు. ఇవాళ సోదరుడు రేవణ్ణతో కలిసి బెంగళూరులో విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేస్తోందని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకూ రూ.100 కోట్లతోపాటు మంత్రి పదవి ఇస్తామని ఆశచూపి తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారని కుమారస్వామి చెప్పారు. '80 ఏళ్ల దేశ చరిత్రలో బీజేపీ చేసినట్టుగా రాజ్యాంగబద్ధమైన పదవులను మరే పార్టీ కూడా దుర్వినియోగం చేయలేదు. అమిత్‌ షా తదితర నేతలు 'హార్స్‌ ట్రేడింగ్‌'ను ప్రోత్సహిస్తున్నారా లేక రాజ్యాంగ నిర్మాణాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా?' అని ప్రశ్నించారు. సెక్యులర్‌ ఓట్లు చీలడం వల్లే బీజేపీకి అన్ని సీట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రేవణ్ణ మాట్లాడుతూ తామంతా ఒకటేనని, పార్టీ నుంచి బయటకు వెళ్లేదిలేదని రేవణ్ణ స్పష్టం చేశారు. కుమారస్వామిని జేడీఎస్‌ శాసససభా పక్ష నేతగా ఎన్నుకున్నామని రేవణ్ణ చెప్పారు. జేడీఎస్‌లో చీలిక ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.