కుప్పకూలిన కుమారస్వామి సర్కార్

కుప్పకూలిన కుమారస్వామి సర్కార్

ఎట్టకేలకు కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష జరిగింది.  ముందు నుండి అనుకున్నట్టే కుమారస్వామి సర్కార్‌ కుప్పకూలింది.  99- 105 ఓట్ల తేడాతో ప్రభుత్వం పడిపోయింది.  విశ్వాస తీర్మానంపై చర్చించిన అనంతరం సభలో ఓటింగ్‌ మొదలుకాగా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన కనీస మెజార్టీ సభ్యుల మద్దతును సంకీర్ణ సర్కార్‌ పొందలేకపోయింది. 

స్పీకర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది వరుసల వారీగా ఒక్కో సభ్యుడ్ని లెక్కించారు. ఈ పరీక్షలో అధికార కూటమికి 99 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉండగా.. ప్రతిపక్ష కూటమికి 105 మంది సభ్యుల మద్దత్తు దక్కింది.   మ్యాజిక్ల్ ఫిగర్‌ 103ను చేరుకోలేకపోవడంతో జేడీఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.