శ్రీశైలంలో కుంభోత్సవం.. ఆర్జిత సేవలు రద్దు..

శ్రీశైలంలో కుంభోత్సవం.. ఆర్జిత సేవలు రద్దు..

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 23వ తేదీన (మంగళవారం)భ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఇక కుంభోత్సవం సందర్భంగా రేపు ఉదయం సుప్రభాత సేవ, మహామంగళహారతి, ఆర్జిత సేవల రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.