అక్కడి నుండి తెలంగాణ వచ్చారా ?.. క్వారంటైన్‌ తప్పనిసరి !

అక్కడి నుండి తెలంగాణ వచ్చారా ?.. క్వారంటైన్‌ తప్పనిసరి !

ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు జరిగిన కుంభమేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో ఉండాలని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా.శ్రీనివాస్‌ తెలిపారు. కచ్చితంగా 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని సూచించారు. ఇంట్లోనూ మాస్క్‌ ధరిచాలన్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ఇంకేమైనా సందేహాలుంటే వెంటనే 104 నంబర్‌కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.