మచిలీపట్నంలో కుంబ్లే..

మచిలీపట్నంలో కుంబ్లే..


టీమిండియా మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే ఇవాళ మచిలీపట్నం విచ్చేశారు. భారత క్రికెట్‌ జట్టు తొలి కెప్టెన్‌ కల్నల్‌ సీకే నాయుడు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అథ్లెటిక స్టేడియానికి శంకుస్థాపన చేశారు. కుంబ్లేకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఘనస్వాగతం పలికారు. కంబ్లేను చూసేందుకు స్థానిక యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా  కుంబ్లే మాట్లాడుతూ భారత క్రికెట్‌ జట్టు అభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప క్రికెటర్‌ సీకే నాయుడు అని కొనియాడారు. నాయుడి విగ్రహాన్ని ఆయన స్వస్థలంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.