ఏపీ మంత్రి ఇంట్లో విషాదం

ఏపీ మంత్రి ఇంట్లో విషాదం

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు, సుదీర్ఘ కాలం క్రియాశీల పాత్రికేయ రంగంలో సేవలందించిన కురసాల సురేష్‌బాబు(42) హఠాన్మరణం చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సురేష్ బాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేష్‌ మృతదేహాన్ని కన్నబాబు మరికాసేపట్లో స్వగ్రామానికి తీసుకురానున్నారు. సురేష్ హఠాన్మరణంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కన్నబాబుకు ఫోన్ చేసిన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
ప్రముఖ దినపత్రిక 'ఈనాడు'లో కంట్రిబ్యూటర్‌గా జర్నలిజం కెరీర్‌ ప్రారంభించిన సురేష్‌బాబు.. క్రమంగా స్టాఫ్ రిపోర్‌గా ఎదిగారు. స్టాఫ్‌ రిపోర్టర్‌గా విశాఖపట్నంలో సురేష్ చాలాకాలం పాటు పనిచేశారు.