బుట్టా రేణుక సంచలన నిర్ణయం..

బుట్టా రేణుక సంచలన నిర్ణయం..

కర్నూలు పార్లమెంట్ సభ్యులు బుట్టా రేణుక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత టీడీపీ గూటికి చేరిన ఆమె.. త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రేపు కడప జిల్లా ఇడుపులపాయ వెళ్లనున్న బుట్టా దంపతులు... వైఎస్ జగన్‌ను కలవనున్నారు. టీడీపీని వీడి... తిరిగి వైసీపీలో చేరాలని బుట్టా కుటుంబ సభ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కర్నూలు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు బుట్టా రేణుక. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో చేరడంతో బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వలేకపోయింది అధిష్టానం. అయితే, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని సూచిచింది. అక్కడ గెలుపు అవకాశాలు లేవంటూ ఆదోని నుంచి పోటీ చేసేందుకు బుట్టా రేణుక నిరాకరించారు.