కర్నూలులో రాహుల్ సభ సక్సెస్: బైరెడ్డి

కర్నూలులో రాహుల్  సభ సక్సెస్: బైరెడ్డి

కర్నూలులో సత్యమేవ జయతే పేరిట నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైందని కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సభకు జనం స్వచ్చంధంగా తరలివచ్చారని అన్నారు. రాహుల్ గాంధీతో కర్నూలు తరహా సభలు ఏపీ అంతటా నిర్వహిస్తామని తెలిపారు. టీడీపీ ధర్మపోరాట దీక్షకు జనాలను తరలించిన రాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీని ఎవరూ అపలేరని బైరెడ్డి తెలిపారు. రాహుల్ సభ సక్సెస్ కావడంతో ఇతర పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.

రాహుల్ కర్నూలు పర్యటనతో కాంగ్రెస్ నేతల్లో నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తానని.. విభజన హామీలు అమలు చేయకుంటే రాష్ట్రంలో అడుగుపెట్టనని ఆయన శపథం చేయడం పార్టీకి మంచి మైలేజ్ ఇస్తుందని నేతలు అంటున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్టీపరంగా స్పష్టత ఇవ్వడమేకాక... ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మోసాన్ని వివరించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.